ద్వివజ్ర కవచం
వజ్ర కవచానికి “వజ్రచ్ఛేదిక ప్రజ్ఞాపారిమిత సూత్రాని”కి ఉన్న సంక్షిప్తనామం వజ్ర సూత్రం. “మానవాతీతమైన జ్ఞానాన్ని పొందిన హృదయం” అని అర్థం. దీనిని హృదయ సూత్రం, వజ్ర సూత్రం అనేవి ప్రజ్ఞాపారిమిత (పరిపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేది) అని అర్థం. విద్యార్థులు ద్వివజ్ర కవచధారణ చేసినట్లైతే మంచి జ్ఞానం కలుగుతుంది. చదివినది గుర్తుంటుంది. అలాగే పోటీ పరీక్షలకు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు సైతం తప్పక ద్వివజ్ర కవచ ధారణ చేయడం మంచిది.
ఈ ద్వివజ్ర కవచంలోని నాలుగు వైపులు భౌతికమైన విషయాలన్నీ స్వప్నాలూ, భ్రమలూ, బుడగలూ, నీడలూ అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచిస్తుంది. కనుక ఆధ్యాత్మిక రంగంలో ఉండేవారు అంటే ఆలయ పూజారులు, జ్యోతిష్కులు, సేవా సంస్థలు నిర్వహించేవారు, పంచాంగ కర్తలు, భక్తి గీతాలు / రచనలు చేసే రచయితలు ద్వివజ్ర కవచాన్ని ధరించడం అనివార్యం.
నాలుగు వేదాలలో భాగమైన ఋగ్వేదంలో వజ్ర యొక్క ప్రాచీన ప్రస్తావన ఉంది. వజ్ర ఇంద్రుడు ఆయుధంగా వర్ణించబడింది. ఇంద్రుడు పాపులను మరియు నిర్లక్ష్య వ్యక్తులను చంపడానికి వజ్రను వాడతాడు. కనుక ఎవరు ఈ ద్వివజ్ర కవచాన్ని ధరిస్తారో వారికి శతృభయం ఉండదు. ఉద్యోగంలో ఉన్నత పదవి అధిరోహిస్తారు. తోటి ఉద్యోగస్తుల మధ్య గౌరవ మర్యాదలు లభిస్తాయి. నాయకత్వ లక్షణాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు తప్పక ఈ ద్వివజ్ర కవచాన్ని ధరించడం చెప్పదగిన సూచన.
ద్వివజ్ర కవచం అమితభ అంటే కోరికలను అదుపుచేసి వ్యక్తిత్వం యొక్క వివేకం, వివేక జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. అక్షోభ అంటే కోపద్వేషాలను పారద్రోలి అద్దం వంటి జ్ఞానాన్ని అందిస్తుంది. వైరోకణ అంటే మాయ నుండి బయటకు మనలను తీసుకువచ్చి నిజజ్ఞానాన్ని అందిస్తుంది. రత్నసంభవ అంటే దురాశాహంకారాల నుండి రక్షించి శాంత జ్ఞానాన్ని అందిస్తుంది. అమోఘసిద్ధి అంటే అసూయను తరిమికొట్టి అన్ని సాధించే జ్ఞానాన్ని అందిస్తుంది.
పరం వీర చక్ర అనేది భారతదేశంలో అత్యున్నత సైనిక అలంకరణగా చెప్పవచ్చు. ఈ పరంవీర చక్రలో సైకం ద్వివజ్ర చోటు చేసుకుందంటే ఈ ద్వివజ్ర ఔన్నత్యం మాటల్లో చెప్పనలవికానిదని అర్థం. యుద్ధ సమయంలో తమ పరాక్రమ శక్తులను ప్రదర్శించినందుకు పరంవీరచక్రను బహుకరిస్తారు.
-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి