నేపాల్ గూర్కా కుక్రి కత్తి కవచం
మనకి నేపాల్ అంటే గూర్కాలు గుర్తుకు వస్తారు. వారి ఆయధం కుక్రి (చిన్న కత్తి). అసలు గూర్క అంటే నేపాల్ నుంచే రావాలి అనే అభిప్రాయం మనలో కలిగిందంటే అది కేవలం వారి ధైర్య సాహసాలు నిజాయితీలే కారణం. మనం ఇచ్చే పదో పరకో తీసుకొని వీధులన్నీ కాపలా కాసిన గూర్కాలు మీకు గుర్తు ఉండే ఉంటారు. గూర్కాలు కేవలం కాపలాదారులు కాదు వారు బ్రిటిష్ ఆర్మీ గూర్కాలు, భారత ఆర్మీ గూర్కాలు, సింగపూర్ కంటింజెంట్, బ్రునై రిజర్వు యూనిట్లలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరి వీరగాధలు అనేకం. కుక్రి నేపాల్ యొక్క జాతీయ కత్తి మాత్రమే కాదు, గూర్ఖా సైనికుడి గర్వచిహ్నం కూడా. డిటెక్టివ్, స్పై ఏజన్సీ, సెక్యూరిటీ, మిలటరీ, పోలీస్ శాఖల్లో పనిచేసేవారికి ఈ నేపాల్ గూర్కా కుక్రి కత్తి కవచం ఓ వరం. వారు ఈ కవచాన్ని ధరించినట్లైతే విపరీత అభివృద్ధి కలుగుతుంది. వారి వృత్తిలో అసాధారణ ప్రతిభగలవారై ప్రతి పనియందు విజయాన్ని పొందుతారు. నేపాల్ గూర్కా కుక్రి కత్తి కవచధారణవలన సకల ఆయురారోగ్యాలతో, భోగ భాగ్యాలతో సంపదలతో, రాజ్యపూజ్యత గౌరవం, పిరికివారికి ధైర్యం, ఆరోగ్యము, వంశాభివృద్ది, సకలసౌభాగ్యాలు కలుగుతాయి. సర్వ భయాలు తొలగుతాయి. పఠించవలసిన శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన| మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి||
నేపాల్ గూర్కా కుక్రి కత్తి కవచధారణవలన లివర్ వ్యాధులు, మూలశంక రక్తపోటు, జ్వరము, దేహతాపము, చర్మవ్యాధులు, గడ్డలు వ్రణములు వాపులు కీళ్ళబాధలు జననేంద్రియములకు సంబంధించిన అన్ని రోగములు, కడుపునొప్పి కాన్సరు మొదలగు యింకా అనేక వ్యాధులను శీఘ్రంగా నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతులగుటకు పరిపూర్ణ సంతోషముతో తృప్తిగల సుఖవంతమైన జీవితమును గడుపుటకు తోడ్పడగలదు.
కొద్దిగా చరిత్రను కూడా తెలుసుకుందాం. నేపాల్ భారతదేశం కన్నా రెండున్నర దశాబ్దాల ముందే బ్రిటిష్ నుండి ముక్తి పొందింది. అందుకు కారణం నేపాల్ గూర్కాల కుక్రి కత్తి వీర సాహసాలే. 1815 పూర్వం నేపాల్ చాలా విశాలమైనది. నేటి ఉత్తరప్రదేశంలోని సింహభాగం, కొద్ది బీహార్, సిక్కిం, చైనాలో అతి కొద్దిభాగం, భూటాన్… నేపాల్ లో భాగాలే. 1815లో బ్రిటిషువారితో సుగాలీ ఒప్పందంలో భాగంగా నేపాల్ చాలా భూభాగం బ్రిటిషువారికి ధారాదత్తం చేయాల్సి వచ్చింది. ప్రతీఏటా రెండు లక్షల రూపాయిలు కప్పం కట్టవలసివచ్చింది. 1923లో ఈ ఒప్పందం రద్దు అయ్యింది. నేపాల్ సర్వ స్వతంత్రురాలు అయ్యింది. ఈనాడు సిక్కిం, ఉత్తరప్రదేశంలో కొన్ని భాగాలూ భారత్లో భాగం అవటం ఈ ఒప్పంద పుణ్యమే. బ్రిటిషు వారు నేపాలీలను ఆనాటినుంచి నేటివరకు వారి సైన్యంలో భాగం చేసుకున్నారు. ఆనాటి రాజు గిరివన్ యుద్ధ బిక్రమ్ షా కుదుర్చికున్న సుగాలీ ఒప్పందం వల్ల, బ్రిటీష్ మైత్రీ హస్తం, రాజరిక సుస్థిరత వచ్చింది. నేపాల్ లో 2008 వరకు రాజరికం సాగింది.
-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి