Please expect natural variations.
The images signify actual product however color of the image and product may slightly differ.
మేధావి ఉంగరం
తెలివి ఒకరి సొత్తు కాదు. సమయం సందర్భం అవకాశం అవసరాన్ని బట్టి తెలివి బయటపడుతుందన్నది ఆర్యుల విశ్వాసం. నలుగురిలోకి ప్రత్యేకం అనిపించుకోవాలంటే భిన్నంగా ఆలోచించాలి. అటువంటి ఆలోచనా శక్తికి దోహదపడుతుంది మేధావి ఉంగరం. పేరుకు తగ్గట్టే ఈ ఉంగరం సామాన్యుడిని సైతం మేధావిని చేయగల సమర్ధత ఈ ఉంగరానికి ఉంది. మేధా శక్తికి మూల హేతువైన మేధా దేవిని మేధా సూక్తమ్ ద్వారా ప్రార్థించడం తైత్తరేయారణ్యకంలో కనపడుతుంది. కనుక మేధావి ఉంగరం ధరించి మేధా సూక్తమును నిత్యం పఠించడం మంచిది.
మేధా సూక్తమ్
ఓం యశ్ఛంద’సామృషభో విశ్వరూ’పః | ఛందోభ్యోஉధ్యమృతా”థ్సంబభూవ’ | స మేంద్రో’ మేధయా” స్పృణోతు | అమృత’స్య దేవధార’ణో భూయాసమ్ | శరీ’రం మే విచ’ర్షణమ్ | జిహ్వా మే మధు’మత్తమా | కర్ణా”భ్యాం భూరివిశ్రు’వమ్ | బ్రహ్మ’ణః కోశో’உసి మేధయా పి’హితః | శ్రుతం మే’ గోపాయ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఓం మేధాదేవీ జుషమాణా న ఆగా”ద్విశ్వాచీ’ భద్రా సు’మనస్య మా’నా | త్వయా జుష్టా’ నుదమా’నా దురుక్తా”న్ బృహద్వ’దేమ విదథే’ సువీరాః” | త్వయా జుష్ట’ ఋషిర్భ’వతి దేవి త్వయా బ్రహ్మా’உஉగతశ్రీ’రుత త్వయా” | త్వయా జుష్ట’శ్చిత్రం విందతే వసు సా నో’ జుషస్వ ద్రవి’ణో న మేధే ||
మేధాం మ ఇంద్రో’ దదాతు మేధాం దేవీ సర’స్వతీ | మేధాం మే’ అశ్వినా’వుభా-వాధ’త్తాం పుష్క’రస్రజా | అప్సరాసు’ చ యా మేధా గం’ధర్వేషు’ చ యన్మనః’ | దైవీం” మేధా సర’స్వతీ సా మాం” మేధా సురభి’ర్జుషతాగ్ స్వాహా” ||
ఆమాం” మేధా సురభి’ర్విశ్వరూ’పా హిర’ణ్యవర్ణా జగ’తీ జగమ్యా | ఊర్జ’స్వతీ పయ’సా పిన్వ’మానా సా మాం” మేధా సుప్రతీ’కా జుషంతామ్ ||
మయి’ మేధాం మయి’ ప్రజాం మయ్యగ్నిస్తేజో’ దధాతు మయి’ మేధాం మయి’ ప్రజాం మయీంద్ర’ ఇంద్రియం ద’ధాతు మయి’ మేధాం మయి’ ప్రజాం మయి సూర్యో భ్రాజో’ దధాతు ||
ఓం హంస హంసాయ’ విద్మహే’ పరమహంసాయ’ ధీమహి | తన్నో’ హంసః ప్రచోదయా”త్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
మేధా ఉంగరం ధరించి ప్రతిరోజు మేధా సూక్తం పఠించటం వలన విధ్యార్ధులకు, ఉన్నత విద్యలు అభ్యసించేవారికి చదువు పట్ల శ్రద్ధ పెరిగి మేధా శక్తి మెరుగుపడటమే కాకుండా తెలివితేటలు, మాట్లాడే సామర్ధ్యాన్ని పెంచుతుంది. వ్యాపారస్థులు ఉద్యోగస్థులు సైతం మేధా ఉంగరం ధరించి మేధా సూక్తమ్ పఠించటం ద్వారా వారి మేధాశక్తి పెరిగి తమ తెలివిని ప్రదర్శించి వారు చేసే వృత్తి వ్యాపారాలలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు.
-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి