Kapila Kurma Kavach
కపిల కూర్మ కవచం
దేవదానవులు, వాసుకుని (పాము) తాడుగా చేసుకొని, మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, అమృతాన్ని పొందటం కోసమై పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు, మహాపర్వతమైన మంధర పర్వతం సముద్రంలో మునిగిపోతూవుంటే, దేవదానవుల కార్యం విఫలమైపోసాగింది. అప్పుడు వారి అభ్యర్ధన మేర, శ్రీ మహావిష్ణువు, తాబేలు రూపంలో ఆ పర్వతాన్ని తన వీపుపై మోపుకొని, దేవదానవులకు అమృతాన్ని సాధించటంలో సహాయపడతాడు. ఇది ఈ అవతార సారాంశం. అసలు కూర్మావతారం లేకపోతే మనకి సాగర మథనం లేదు. సిరిల తల్లి శ్రీమహాలక్ష్మి లేదు. దేవతల వైద్యుడు ధన్వంతరి లేడు. రంభ, మేనక, ఊర్వశి, ఘృతాచి, తిలోత్తమ, సుకేశి, చిత్రలేఖ, మంజుఘోష మొదలగు అప్సరసలు లేరు. కౌస్తుభము అనే అమూల్యమైన మాణిక్యం ఇతర రత్నాలు లేవు. కల్పవృక్షము, కోరిన కోరికలు ఇచ్చే చెట్టు లేదు. కామధేనువు, కోరిన కోరికలీడేర్చే గోమాత, సకల గో సంతతికి తల్లి లేదు. ఐరావతము, ఇంద్రుని వాహనమైన ఏనుగు లేదు. పారిజాత వృక్షము, వాడిపోని పువ్వులు పూచే చెట్టు లేదు. అమృతము, మరణము లేకుండా చేసేది లేదు. లేదు… లేదు… లేదు…
ఇవ్వన్నీ విష్ణుమూర్తి కూర్మావతారం దాల్చడం వలనే మనకు దక్కాయి. కనుక కపిల కూర్మ కవచాన్ని కంఠమందు లేక చేతికి ధరించి ప్రతి నిత్యం “ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర ధురంధరాయ నమః” అనే మంత్రమును పఠించడం ద్వారా లేదు అనేది లేదు. ఇక అన్నీ ఉంటాయి. ఏమేం ఉంటాయో చూద్దాం…
- ధనం పుష్కలంగా ఉంటుంది.
- ఆరోగ్యం బాగుంటుంది.
- మంచి కోరికలు నెరవేరుతాయి.
- రత్నాలు, బంగారం, వెండి వంటివి సమకూరుతాయి.
- ఇంట శుభకార్యాలు జరుగుతాయి.
- కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది.
- విద్య, వృత్తి, విదేశీయోగం, శీఘ్ర వివాహం, సంతాన భాగ్యం కలుగుతుంది.
- గోవులలో కపిల గోవులు ఎలా శ్రేష్ఠమో కూర్మాలలో కపిల (నల్ల) కూర్మం అంతే శ్రేష్ఠం.
- విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి