చిత్రలేఖ మాల
ఆస్తి నష్టం, చెడుఅలవాట్లు, పుత్ర దోషం మొదలైనవి తొలగాలంటే వెంటనే చిత్రలేఖ మాలను కంఠమందు ధరించాల్సిందే.
అజీర్ణం, స్పోటకము, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు చిత్రలేఖ మాలను ధరించడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.
వైద్యులకే అంతుపట్టని రోగాలు అంటే రోగ నిర్దారణ సాగదు కనుక చికిత్స జరుగుటలో సమస్యలు ఏర్పడితే చిత్రలేఖ మాలను ధరించడం మంచిది.
మృత్యుభయం ఏర్పడినప్పుడు, మతి స్థిమితం లేక పోవుట మొదలైన సమస్యతో బాధపడేవారు చిత్రలేఖ మాలను ధరిస్తే బాగుంటుంది.
చిత్రలేఖ మాలను ధరించేవారికి సకల క్షేమం కలుగగలదు. ప్రసవకాలంలో స్త్రీలకు కలుగు అనేక బాధలు నివారించి సుఖముగా శీఘ్రంగా ప్రసవం చేయింపగలదు. అంతే గాక ప్రసవానంతరం సంభవించే దుష్టలక్షణముల నుండి పూర్తిగా రక్షణ కలిగించగలదు.
అమ్మవారు, ఆటలమ్మ, తడపర, కలరా, మొదలగు బాధించినప్పుడు ఆ గృహం నందలి సింహద్వారమునకు పైభాగమున ఈ చిత్రలేఖ మాలను అలంకరించినప్పుడు ఆ సమస్యలు ఉపశమనమౌతాయి.
చిత్రలేఖ మాలను ధరించినవారికి శతృవులు సైతం మితృలుగా మారిపోగలరు. పగవారు చేయు చేతబడి, ప్రయోగములు మొదలగు కృత్రిమములు భూత భేతాళ, యక్ష రాక్షస, శాకినీ, కామినీ మోహినీ, గ్రహబాధలు దరిజేరలేవు. దీని వలన జీవితములో మంచి అభివృద్ధి, మేధాశక్తి, ఆలోచనా పటిమను, కార్య సాధన, జనాకర్షన కలుగుతాయి.
చిత్రలేఖ మాలధారణవలన చేసి “ఓం స్త్రం స్త్రిం స్త్రౌం సః చిత్రలేఖనే నమః” అనే మంత్రాన్ని పఠించడం ద్వారా కీర్తి గౌరవ మర్యాదలు, భోగ భాగ్య సంపదలు, వాహన ప్రాప్తి, గృహ లబ్ది, కళత్ర సౌఖ్యము, కుటుంబ సుఖశాంతులు, శతృనాశనము, కార్యసిద్ది, దేహారోగ్యము, సకల వ్యాధినాశనము, ఆయువృద్ధి, అరిష్టనివారణ, దుష్టగ్రహ బాధా విముక్తి, దేవతానుగ్రహము, సుఖము, శాంతి సద్భావన, సజ్జన స్నేహము, సర్పదోష పరిహారము, సంతానప్రాప్తి, వంశాభివృద్ధి కలుగగలవు.
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి