శుకాపుట్ట రూపు
శుకాపుట్ట రూపు ధరించడం ద్వారా సంతానప్రాప్తి, వంశాభివృద్ధి కలుగుతుంది. సంతానహీనులు శుకాపుట్ట రూపు ధరించిన పూర్ణాయుర్ధాయం కలిగిన పుత్రసంతానం కలుగుతుంది.
విద్యార్థులు శుకాపుట్ట రూపు ధరిస్తే పరీక్షలలో విజయం సాధించగలరు. విద్యలో ఆసక్తి పెరిగి శ్రద్ధగా చదివి ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులవుతారు.
శుకాపుట్ట రూపు ధరించినవారు దైవభక్తి, దైవచింతన, సత్ ప్రవర్తన కలిగి ఉంటారు.
త్రాగుడు, జూదం, వ్యభిచారం మొదలగు వ్యసనపరులు శుకాపుట్ట రూపు ధరిస్తే వ్యసనములపై ఆసక్తి తగ్గి సుఖజీవనము చేయగలరు.
జీర్ణశక్తిని, మేధాశక్తిని, నరాల బలహీనతలను, చేతులు, కాళ్ళు, శరీరం వణుకుట, ఉదర సంబంధమైన వ్యాధులు మొదలగు సమస్యలతో బాధపడేవారు శుకాపుట్ట రూపు ధరిస్తే ఉపశమనం కలుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది.
వ్యాపారం చేసేవారు శుకాపుట్ట రూపు ధరించి “ఓం వృషభద్వజాయ విద్మహే కృణి హస్తాయ ధీమహీః తన్నో గురు ప్రచోదయాత్” అనే మంత్రాన్ని అనునిత్యం పఠించడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.
శుకాపుట్ట రూపు ధరించినవారికి ఉద్యోగములో అప్రయత్నంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అధికారుల ప్రశంసలు పొందగలరు.
ఏ నక్షత్రాలలో జన్మించినవారైనా కష్టనష్టాలు, దరిద్రం తొలగిపోవుటకు, అదృష్టం కలసి రావటానికి, పేరు ప్రతిష్టలు, గౌరవం లభించేందుకు శుకాపుట్ట రూపు ధరించటం మంచిది.
-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి